చంద్రబాబుకు ప్రాణహాని.. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తాం : న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

by Seetharam |   ( Updated:2023-09-11 06:18:24.0  )
చంద్రబాబుకు ప్రాణహాని.. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తాం : న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జైల్లో ప్రాణహాని ఉందని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు. చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదు అని అన్నారు. చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. హౌస్ అరెస్ట్‌ పిటిషన్‌పై వాదానలు వినిపిస్తాం అని స్పష్టం చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు సిద్ధార్థ లూథ్రా తన టీంతో కలిసి సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో లూద్రా చిట్ చాట్ చేశారు. హౌస్ రిమాండ్‌కు పట్టుబడతామని వెల్లడించారు. 2021లో పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు మంత్రులు ఒక కేసులో రిమాండ్ విధించిందని... అయితే నాడు కోర్టును ఆశ్రయించగా హౌస్ రిమాండ్ విధించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అదే తరహా హౌస్ రిమాండ్‌ వర్తించేలా కోర్టును కోరబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు హౌస్ రిమాండ్ పిటిషన్ అనంతరం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తాం అని సిద్ధార్థ లూథ్రా తెలిపారు.

Advertisement

Next Story