మాది మెతక ప్రభుత్వం కాదు.. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోము: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-11-10 08:00:55.0  )
మాది మెతక ప్రభుత్వం కాదు.. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోము: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: IASలకు వార్నింగ్‌లు ఇస్తే కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Deputy CM Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు. గుంటూరులో ఆధివారం జరిగిన అరణ్యభవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ(Forest Martyrs Remembrance House) నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని, IASలకు వార్నింగ్‌లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో వచ్చే 20 ఏళ్లు తామే అధికారంలో ఉంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే అధికారులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకున్నారు. తమ ప్రభుత్వంలో అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోమని.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed