పవన్ కల్యాణ్‌పై కేసు పెడతాం.. అక్కడ సెంటు భూమి ఉన్నా రాసిచ్చేస్తా : మంత్రి గుడివాడ అమర్నాథ్

by Seetharam |   ( Updated:2023-08-13 14:32:04.0  )
పవన్ కల్యాణ్‌పై కేసు పెడతాం.. అక్కడ సెంటు భూమి ఉన్నా రాసిచ్చేస్తా : మంత్రి గుడివాడ అమర్నాథ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసులు పెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా రిషికొండలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపించారు. రిషికొండలో డ్రోన్‌లు ఎగురవేసినందుకు పవన్ కల్యాణ్‌పై కేసులు పెడతామని వెల్లడించారు.విశాఖపట్టణంలో ఆదివారం నాడు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అయినప్పటికీ జనసేన నేతలు ఆ నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. అంతేకాదు నిబంధనలకు విరుద్దంగా రిషికొండలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు చేస్తుంటే పవన్ కల్యాణ్‌కు అభ్యంతరం ఏమిటని నిలదీశారు. పవన్ కల్యాణ్ రిషికొండలో వ్యవహరించిన తీరుపై పోలీసులతో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. మరోవైపు విస్సన్నపేట భూముల వద్దకు పవన్ కల్యాణ్ వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు విస్సన్నపేటలో తనకు ఒక సెంటు భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఆ భూమిని వారికే రాసిస్తానని స్పష్టం చేశారు. విస్సన్నపేటలో తమకు ఎలాంటి భూములు లేకపోయినా ఉన్నాయని తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌లో చిరంజీవి, చంద్రబాబు ఎక్కడ ఇళ్లు నిర్మించారో పవన్ కల్యాణ్ తెలుసుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని మరి జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పగలదా అని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఎన్ని నియోజకవర్గాల్ల పోటీ చేస్తారు..? ఒంటరిగా పోటీ చేస్తామని ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

Read more :

Ram Gopal Varma : ‘పవన్ కల్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ నన్ను కామెంట్ చేయలేదు’

Advertisement

Next Story

Most Viewed