‘బందర్ పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తాం’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-02 13:26:18.0  )
‘బందర్ పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తాం’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ రోజు(బుధవారం) స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు హజరైయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. గత YCP ప్రభుత్వం పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం ఆరోపించారు. ఈ క్రమంలో బందర్ పోర్టు(Bandar Port) పనులను ఆకస్మిక తనిఖీ చేశామని తెలిపారు. 3669 పీపీ మోడల్‌లో 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.885కోట్ల పనులు మాత్రమే జరిగాయి.

ఈ నేపథ్యంలో డెవలపర్‌ని పిలిచి డెడ్ లైన్ పెడతానని అన్నారు. పోర్ట్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. పోర్ట్ ఫైనల్ ప్రాజెక్టుకు(Port to final project) 3,696 ఎకరాలు అవసరం. ఇది పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతికి దగ్గరగా ఉండే ఓడరేవు ఇది. ఎంతోమంది ఈ‌ ఓడరేవు కోసం పెద్దపెద్ద ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలకు మంచి జరగాలనే నేపథ్యంలో రాజధాని పోర్టు(Capital port)గా దీన్ని అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఈ సారి బందర్ పోర్టు(Bandar Port) పూర్తి చేసి చూపిస్తాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story