- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద చదువులను కూడా పేదలకు దగ్గర చేశాం.. సీఎం జగన్
దిశ, వెబ్‌డెస్క్: పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. బాపట్ల జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు విద్యాదీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.694 కోట్లను బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 11.02 లక్షల మంది విద్యార్థుకు విద్యాదీవెన పథకాన్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలన్న ఆశయంతో గత మూడు సంత్సరాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులుకు పైచదువుల కోసం ప్రతి ఒక్కరికీ ఫీజు రియింబర్స్‌మెంట్ అందిస్తున్నామని గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాదీవెన పథకం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. పేదలను పెద్ద చదువులకు దగ్గర చేశామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడే విధంగా పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. విద్యారంగంపై మూడేళ్లలో 53 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మన బటి, నాడు నేడు, ఇంగ్లిష్ మీడియం, బైజ్యూస్ ఒప్పందాలతో ఉన్నత చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకుచ్చామన్నారు. ఇటువంటి పథకాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు లేవని ప్రశ్నించారు. నేడు ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత పాలనలో రాష్ట్రంలో నలుగురు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమాలు నేరుగా ప్రజలకే అందుతున్నాయన్నారు. ఎల్లో మీడియా కడుపు మంటతో ప్రభుత్వంపై నిందలు వేస్తోందని జగన్ దుయ్యబట్టారు.