- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌ను కోల్పోవడం వల్లే విశాఖ పై ఫోకస్ చేస్తున్నాం: సీఎం జగన్..
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సామావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. హైదరాబాద్ వంటి మహా నగరాన్ని కోల్పోవడం వల్లే.. తెలంగాణ తో పోల్చుకుంటే ఏపీలో ఆదాయం తగ్గుతుందన్నారు. అలాగే కరోనా కారణంగా కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోందని.. తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదాపై ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదని.. అలా చేసుంటే.. కనీసం కోర్టులో నైనా పోరాడే వారమని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎండమావిగా కనిపిస్తోందన్నారు. ప్రతి రాష్ట్రానికి చెన్నై బెంగూళురు, హైదరాబాద్ వంటి మహా నగరాలు అవసరమని.. అప్పడే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్ నగరం తమతో లేకపోవడం వల్ల పది సంవత్సరాల్లో ఏకంగా రూ లక్షా 40 వేల కోట్లు నష్టపోయామన్నారు. అందుకే తాము విశాఖ పట్నం పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు రూ. 15 వేల కోట్ల రుణమాఫీ కూడా చేయలేదని సీఎం జగన్ అసెంబ్లీ సమావేశంలో చెప్పుకొచ్చారు.