- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. ఆర్డినెన్స్ జారీ
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. 4 నెలల కాలానికి ఈ బడ్జెట్‌ను చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపాదనలు చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను నవంబర్ 30 వరకు కేటాయించారు. ఈ ప్రతిపాదనను గవర్నర్ అబ్దుల్ నజీర్ పరిశీలించారు. ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేశారు.
కాగా ఏపీ సార్వత్రి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు సమయం పడుతుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అనంతరం గవర్నర్‌కు పంపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అబ్దుల్ నజీర్ తాజాగా ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ శారు.
కాగా గత ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. నాలుగు నెలల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అయితే గత ప్రభుత్వం కేటాయించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగిసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రులు ఆమోదం తెలిపారు. అన్నా క్యాంటీన్లు, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయల కల్పన, అత్యవసర విభాగాలు, పోలవరం, కేంద్ర ప్రభుత్వ పథకాల మ్యాచింగ్ గ్రాంట్లకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది.