Selfi Challenge: ఏడాది కావస్తున్నా డిప్యూటీ సీఎం పట్టించుకోరా..!

by srinivas |
Selfi Challenge: ఏడాది కావస్తున్నా డిప్యూటీ సీఎం పట్టించుకోరా..!
X

దిశ, ఉత్తరాంధ్ర: తారక రామ రిజర్వాయర్‌ను మాడుగుల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి పీవీజీ కుమార్ సందర్మించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడుకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం‌లో రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే ధ్యేయంతో తారక రామ రిజర్వాయర్ గండి పూడ్చడానికి చంద్రబాబు రూ. 8 కోట్లు మంజూరు చేసి టెండర్ కూడా పిలిచి అగ్రిమెంట్ చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల కావస్తున్నా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఆ గ్రాంట్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. దీనిని ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లేదంటే తాము వచ్చి పూర్తి చేస్తామని సవాల్ విసిరారు. ఇప్పటికైనా తారక రామ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి చివరి ఆయకట్టుకు నీరు అందించాలని పీవీజీ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed