మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున మనస్థాపం

by srinivas |   ( Updated:2024-02-22 13:35:48.0  )
మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున మనస్థాపం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యలతో కమిడి నాగార్జున మనస్థాపం చెందారు. పార్టీ అధిష్టానం తనను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరిందని గంటా వ్యాఖ్యానించారు. దీంతో చీపురుపల్లిలో అసమ్మతి చెలరేగింది. చీపురుపల్లి ఇంచార్జి కమిడి నాగార్జున మనస్థాపం చెందారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అంతేకాదు పార్టీ పెద్దల ఫోన్లకు కూడా నాగార్జున అందుబాటులో లేరు. దీంతో నాగార్జున ఇంటికెళ్లి మాట్లాడాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. నాగార్జునను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామంతో చీపురుపల్లి టీడీపీలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కిమిడి నాగార్జునకే సీటు ఇవ్వాలని స్థానిక టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అంటున్నారు. లేనిపక్షంలో తాము సహకరించమని హెచ్చరిస్తున్నారు. చీపురుపల్లిలో పార్టీ బలోపేతం కోసం కిమిడి నాగార్జున తీవ్రంగా కృష్టి చేశారని.. ఆయనకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story