Focus On Vizianagaram: మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

by srinivas |   ( Updated:2022-12-18 11:49:14.0  )
Focus On Vizianagaram: మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
X

దిశ, ఏపీ డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా ఆయన ఈనెల 22న రాజాం, 23న బొబ్బిలి, 24న విజయనగరం నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రైతులు, యువతతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా 90 శాతం రైతు సమస్యలు, వరి ధాన్యాలు కొనుగోలుపై, బీసీ సమస్యలపై, పరిశ్రమలు, యువత ఉద్యోగ అవకాశాలతో పాటు మిగతా సమస్యలపై ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తమయ్యారు. అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story