cm Jagan లక్ష చొప్పున ఆర్థిక సాయం

by srinivas |   ( Updated:2022-12-30 17:27:47.0  )
cm Jagan లక్ష చొప్పున ఆర్థిక సాయం
X

దిశ, ఉత్తరాంధ్ర: ముఖ్యమంత్రి ఆదేశాలతో అనారోగ్య బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు రూ.1లక్ష చొప్పున కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అందజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 12 మంది అనారోగ్య బాధిత చిన్నారుల తల్లిదండ్రులు కలిసి తమ గోడును వెలిబుచ్చారు. తమకు సహాయం చేయవలసిందిగా కోరారు. దీనిపై ముఖ్యమంత్రి బాధితులకు వారి అనారోగ్య పరిస్థితులను గుర్తించి వెంటనే లక్ష రూపాయలు అందజేయవలసిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో వారిని పరిశీలించి రూ. లక్ష చొప్పున చెక్కులను అందజేశారు.


దేవరకొండ అమర్త్య రామ్ పుట్టినప్పటినుంచి పీఆర్‌ఎస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అమర్త్య రామ్ నాలిక లోపలికి వెళ్ళిపోయి సలపని వ్యాధితో బాధపడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగరకోయిల్ ఆసుపత్రిలో చూపించి చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 7.5 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు

రావికవతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్ సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. నెలకు రూ. 40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.

కసింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు ప్రతి నెల రూ. 40 వేలు ఖర్చు చేస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. వీరందరికీ సీఎం జగన్ లక్ష రూపాయలు చొప్పున అందజేశారు

Advertisement

Next Story

Most Viewed