Botsa Satyanarayana: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

by srinivas |
Botsa Satyanarayana: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, అనకాపల్లి: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌తో కలసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు మొత్తం 8 రోజులు జరుగుతాయని, ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని ఆయన వివరించారు. పదవ తరగతి పరీక్షలు ప్రాముఖ్యత కలిగి ఉందని, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్.టి.సిలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పక్కా కార్యాచరణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యా శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, జిల్లా వైద్య శాఖ అధికారి హేమంత్, జిల్లా రవాణా శాఖ అధికారి వీర్రాజు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఉప విద్యా శాఖ అధికారి, పోస్టల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed