CM జగన్‌పై వివేకా భార్య సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-15 08:26:54.0  )
CM జగన్‌పై వివేకా భార్య సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను చంపిన హంతకులను జగన్ కాపాడుతున్నారని అనుమానాలు బలంగా ఉన్నాయన్నారు. వివేకా మర్డర్ గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్, ఆయన భార్య భారతికి తెలుసు అని అనుమానం ఉందన్నారు. హత్య జరిగి ఐదేళ్లయినా కేసు ఎంక్వైరీ కొలిక్కొరాకపోవడం, హంతకులకు శిక్ష పడకపోవడంపై సౌభాగ్యమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా చనిపోయాడానికి తెలియగానే తామంతా హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చేశామని.. కానీ జగన్ మాత్రం సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

ఈ ప్రవర్తనే తమ అనుమానానికి కారణమన్నారు. వివేకా హత్య కేసులో కారకులెవరో తేల్చాలని సునీత పట్టుబట్టడంతో ఆమెపై, భర్తపై హత్య నేరం నెట్టాలని ప్రయత్నించారన్నారు. జగన్ సీఎం కావాలని వివేకా కలలు కన్నారని.. కానీ ఇలాంటి పాలన కోసం కాదన్నారు. వైఎస్ మరణించాకే కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయన్నారు. వివూరా మంచి మనిషి, మృదుసభావి అని.. ఆయనకు వస్తున్న ఆదరణ చూసి కొందరు ఓర్చుకోలేకపోయారన్నారు. ఇంట్లోనే శత్రువులు ఉన్నారని ఆలస్యంగా గ్రహించామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న తన కుమార్తె సునీత పిలుపుతో తాను ఏకీభవిస్తున్నా అన్నారు. జగన్‌కు ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు తాను పిలుపునిస్తున్నా అన్నారు.

Read More..

Breaking News: వైసీపీ గూటికి టీడీపీ కీలకనేత.. కారణం ఇదే..!

Advertisement

Next Story

Most Viewed