Chandrababu Nayudu : త్వరలోనే విజన్-2047 కార్యచరణ ప్రకటిస్తాం : సీఎం చంద్రబాబు

by M.Rajitha |
Chandrababu Nayudu : త్వరలోనే విజన్-2047 కార్యచరణ ప్రకటిస్తాం : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) భవిష్యత్తు మార్చేందుకు విజన్ - 2047(Vision-2047) ప్రణాళికలు తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) ప్రకటించారు. శనివారం విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీని దేశంలోనే నంబర్ 1 ప్లేస్ లో నిలిపేందుకు పడి ముఖ్య ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. 2047 వరకు దేశంలో టాప్ ప్లేస్ లో ఏపీని నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో జీరో పావర్టి నెలకొల్పేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక, పరిశోధన రంగాల్లో మన రాష్ట్రమే ముందుండేలా అధికారులు పని చేయాలని అన్నారు. పెట్టుబడులకు తగినట్టు ప్రణాళికలు కూడాఆ ఉన్నప్పుడే అభివృద్ది సాధిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Next Story