- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ నాయకులు ఎర్రం నాయుడు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎర్రం నాయుడు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నాయకులు లోక్ సభ మాజీ సభ్యులు కార్యాలయంలో దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యువ నాయకులు ఎర్రంనాయుడు పోరట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఢిల్లీ లో ఉత్తరాంధ్ర వాణిని వినిపించిన వ్యక్తి స్వర్గీయ ఎర్రంనాయుడు అని కొనియాడారు. ఎర్రంనాయుడు స్ఫూర్తిని తీసుకొని తనయుడు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర సమస్యలు పై పార్లమెంట్ లో తన గళం వినిపిస్తున్నారు అని చెప్పారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మాట్లాడుతూ, ఎర్రం నాయుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తన సేవలను అందించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కారకులలో ఆయన ఒకరిని గుర్తు చేశారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి కోరాడ రాజబాబు రాష్ట్ర పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ, విశాఖ పార్లమెంటు నాయకులు పైల ముత్యాల నాయుడు, విల్లురి చక్రవర్తి, కోట నరేష్, ముక్త రాజారావు , తదితరులు పాల్గొన్నారు.