టీడీపీ దెబ్బకు వైసీపీ కనుమరుగు కాకతప్పదు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

by Shiva |
టీడీపీ దెబ్బకు వైసీపీ కనుమరుగు కాకతప్పదు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, మరో 72 రోజుల్లో టీడీపీ దెబ్బకు వైసీపీ కనుమరుగు కానుందని పేర్కొన్నారు. ఓటమి భయంతో జగన్ అభ్యర్థులను మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని మార్పులు చేసినా.. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఇన్నాళ్లు గాలికొదిలేశారని, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇళ్ల పట్టాలంటూ వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ముఖ్య నేతలంతా టీడీపీలో చేరారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాను మంగళగిరిలో విజయం సాధించలేకపోయినా, 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరిని ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story