టీడీపీ జనసేన ట్రైలర్ విడుదల చేస్తే ..వైసీపీ షాక్?

by Jakkula Mamatha |   ( Updated:2024-02-25 16:41:04.0  )
టీడీపీ జనసేన ట్రైలర్ విడుదల చేస్తే ..వైసీపీ షాక్?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ జనసేన ట్రైలర్ విడుదల చేస్తే వైసీపీ జీరో లు షాక్ తిన్నారని విశాఖ జనసేన నేతలు ఆరోపించారు.తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేశాయని జనసేన నేతలు పీతల మూర్తి యాదవ్, పీవీఎస్ఎన్ రాజు అన్నారు.ఆదివారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ, జనసేన అభ్యర్ధులను ప్రకటిస్తే పులివెందుల పిల్లి విడతలుగా సమన్వయ కర్తలు ప్రకటిస్తుందని, వారు కూడా అభ్యర్థులు కాదు అని మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. పదే పదే జనసేన ను విమర్శించే మంత్రులు అంబటి అమర్, రోజా వైకాపాలో తమ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని, విమర్శలు మాని జగన్ మోహన్ ని మా టికెట్ ఎక్కడ అని అడగాలని సలహా ఇచ్చారు.కోడిగుడ్డు మంత్రి అమర్ సీన్ కాలిపోయిందని, విమర్శలు మాని దమ్ముంటే తాను ఎక్కడి నుంచి పోటీచేస్తున్నానో అమర్ ప్రకటించాలని సవాల్ విసిరారు.అమర్ పదే పదే నా తలరాత జగన్ రాస్తాడు అని చెబుతున్నారు. ఏపి ప్రజల తలరాత నాశనం చేసి..నిరుద్యోగం లో 24 స్థానం కి తీసుకొచ్చిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఐటీ మంత్రి గా విశాఖలో ఐటీ హిల్ గుమ్మం ఎక్కని అమర్ కూడా పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కు ఏమీ చేయని, ఇక్కడి ఆస్తులను పూర్తిగా దోచుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ ను జనం ఈ సారి క్షమించరని స్పష్టం చేశారు.

Read More..

తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు రోజా రెడీ: కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story