అరకు రిపోర్టు రెడీ.. త్వరలో జగన్‌కు అందజేత

by srinivas |
అరకు రిపోర్టు రెడీ.. త్వరలో జగన్‌కు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: అరకు నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టుంది. వరుసగా రెండు సార్లు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. అయితే ఈసారి పరిస్థితులు మారాయి. వర్గ విభేదాలు తలెత్తాయి. దీంతో వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. నియోజకవర్గంలో సర్వేలు చేయించింది. దీంతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అసెంబ్లీ బరిలో దించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా ఆమెను నియమించింది. దీంతో ఆమె అరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్నారు. అయితే చెట్టి పల్గుణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో తన నియోజకవర్గంలో ఎంపీ, ఇంచార్జి గొడ్డేటి మాధవి ప్రోటోకాల్ పట్టించుకోకపోవడంతో చెట్టి పల్గుణ అసంతృప్తిగా ఉన్నారట. దీంతో ఆమె పర్యటనకు ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. నాలుగు క్రితం జరిగిన కార్యక్రమంలోనూ గొడ్డేటి మాధవిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తే తాము సహకరించబోమని హెచ్చరించారు.


దీంతో వైసీపీ అధిష్టానం రంగంలోకి దింగింది. ఇరువుల నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని పంపింది. ఇవాళ ఆయన అరుకులో పర్యటించారు. ఇరువురు నేతలు, కార్యకర్తలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేయాలని, పార్టీలో బలోపేతానిక కృషి చేయాలని సూచించారు. అలాగే నియోజవర్గంలో కార్యకర్తలు, నేతలు అభిప్రాయాన్ని సైతం సేకరించారు. నియోజకవర్గంలో ఎవరైతే గెలుపు అవకాశాలుంటాయానే సమాచారాన్నీ రాబట్టారు. ఇక ఈ రిపోర్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించనున్నారు. దీంతో అరకు ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గం నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed