- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ శారదా పీఠానికి వచ్చి సింహాచలం ఎందుకు రారో?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబు పాలన స్వర్ణయుగం జగన్ పాలన రాతి యుగం అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ఉందని, ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ ఈనాడు పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.వివేకా హత్య జరిగితే చంద్రబాబు పై ఘోరంగా సాక్షి పేపర్ లో రాశారు..వైసీపీ లాగా అప్పుడు మేము స్పందిస్తే పరిస్థితి ఎలా ఉండేది? చినబాబుకు చిరు తిళ్ళు అంటూ జగన్ మీడియా అవాస్తవాలు రాశారు. కోర్టుకు వెళ్లారే తప్ప, దాడులకు దిగలేదు .కుర్చీ మడత పెట్టి జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇంటికి వెళ్లడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ’ అని అన్నారు.
సీఎం జగన్ కి శారదా పీఠానికి రావడానికి సమయం ఉంటుంది. కానీ పీఠానికి అతి దగ్గరలో ఉన్న సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి మాత్రం రావడం లేదు. జగన్ సీఎం అయిన తర్వాత ఒక్క సారి కూడా సింహాచలం స్వామిని దర్శించుకోలేదు. కోడి గుడ్డు మంత్రి కి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ గెలిచారన్న విషయాన్ని గుడివాడ అమర్నాధ్ మర్చిపోయారా? లోకేష్ పై గుడివాడ అమర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం . చంద్రబాబుని లోకేష్ ని విమర్శించే స్థాయి మీకు లేదు అమర్, అసలు నీ బతికేంటో మీ కుటుంబం ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఈరోజు జగన్ రెడ్డి ఎదో అండగా ఉన్నారని ఆవాకులు చావాకులు పేల్చితె సహించేది లేదు ’ అని హెచ్చరించారు