- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చాపురం నియోజకవర్గంలో గెలుపెవరిది?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో ఒకటో నెంబర్ తో ప్రారంభమయ్యే ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురంలో జెండా పాతడానికి అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు తెలుగుదేశం గట్టిగా అడ్డు తగులుతుంది. ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించి అక్కడ కోట్ల ఖర్చుతో భారీ పైలాన్ నిర్మించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఆ నియోజక వర్గం మాత్రం కొరుకుడు పడడం లేదు. అందుకు కారణం అశోకుడు. కాకలు దీరిన రాజకీయ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయ అక్షరాభ్యాసం చేసి ప్రజల నాడి తెలుసుకున్న యువనేత.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ బెందాళం అశోక్ ఇచ్ఛాపురం నియోజకవర్గానికి పక్కా లోకల్. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బెందాళం అశోక్ మూడోసారి ఎన్నికల బరిలో దిగారు. 2014లో మొదటిసారిగా పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సర్తు రామారావు యాదవ్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు సాయిరాజ్ భార్య, మొన్నటి వరకూ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేసిన విజయ ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు.
నిరంతరం ప్రజలతో మమేకం
నిరంతరం పార్టీ కార్యక్రమాలతో పాటు శాసనసభ్యులుగా నిత్యం ప్రజలకు అందుబాటులో వుండే అశోక్‌ను ఓడించేందుకు వైసీపీ పలు ప్రయోగాలు చేసినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. ఈ పది ఏళ్లలో కొంతకాలం అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా 2019లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలను కొనసాగించారు. మూడవసారి పోటీలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, బలమైన మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టి ఖాతా తెరవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
గ్రూపులే విజయకు శాపం
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి విజయకు పార్టీలోని గ్రూపులే శాపంగా మారాయి. విజయ భర్త సాయిరాజ్ కు ఆ నియోజక వర్గంలో బలమైన అనుచర గణంవుంది. ఆయనతో పాటు 2014 లో పోటీ చేసిన నర్తు రామారావు యాదవ్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య పోరును ముగించేందుకు ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, సహ సమన్వయకర్త చిన్న శ్రీను లు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఫలితంగా విజయ ప్రచారానికి జనాలు కరువు అవుతున్నారు. వైసీపీ బలం ఎంతో స్పష్టం కావడంతో ఈసారి కూడా టీడీపీకి ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వనుందన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి పిరియా విజయ ప్రచారానికి వైసీపీలో కొందరు సీనియర్లు ముఖం చాటేయడంతో అధిష్టానం వారితో బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ మెజార్టీ వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో ప్రచారానికి సహకరించడం లేదనే వాదన వినిపిస్తోంది.
ప్రచారంలో దూసుకుపోతున్న అశోక్
ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఎన్నికల ప్రచారంలో తన క్యాడర్ వెంట పెట్టుకొని దూసుకుపోతున్నారు. టీడీపీ ఇంటింటా ప్రచారంలో సీనియర్ నేతలు సదానంద రౌళా, బిమణిచంద్ర ప్రకాష్, బాసుదేవ్ రౌళా, భీమారావు రౌళా, ఆశపు చిరంజీవులు తదితరులు చురుగ్గా పాల్గొంటూ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు.