ఓ అనాధకి పెళ్లి చేసిన సేవా సంస్థ ఎక్కడంటే..?

by Jakkula Mamatha |
ఓ అనాధకి పెళ్లి చేసిన సేవా సంస్థ ఎక్కడంటే..?
X

దిశ, ప్రతినిధి విశాఖపట్నం: ఈ అమ్మాయి పేరు అనిత. వయసు 20 సం.లు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. పాపా హోం, స్వధార్ హోం లో ఉంటూ ఇంటర్మీడియట్ వరకు కష్టపడి చదువుకుంది. తను మేజర్ అవడంతో స్వధార్ హోం వారు జీవీఎంసీ సహకారంతో టీఎస్ఆర్ కాంప్లక్స్ లో ఏయూటీడీ సంస్ద నిర్వహిస్తున్న షెల్టర్ హోం కి అప్పగించారు. అనితకి ఒక మంచి జీవితం అందించడం కోసం గతంలో ఇదే షెల్టర్ లో ఉంటూ ఉపాధి పొందిన ఖాదర్ (24 ) అనే యువకుడు ముందుకు రావడంతో ఇద్దరి అభీష్టం మేరకు ఈరోజు భీం నగర్ షెల్టర్ లో నిరాశ్రయుల అందరి సమక్షంలో వివాహం జరిపించారు. అనిత కి ఏయూటీడీ లో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తూ, రోడ్లపై తనలాంటి మరింత మందికి సేవలందించే భాద్యతను అప్పగించినట్లు సంస్థ నిర్వాహకుడు ప్రగడ వాసు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed