- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP MLC Election:విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
by Jakkula Mamatha |
X
దిశ, డైనమిక్ బ్యూరో:విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి(మంగళవారం) నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఇక ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాగా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. స్టెప్టెంబర్ 3న ఫలితాలు విడుదల చేయనున్నారు.
Advertisement
Next Story