CPI: గ్యాస్ ధరల పెంపుపై వినూత్న నిరసన

by srinivas |   ( Updated:2023-03-01 14:46:29.0  )
CPI: గ్యాస్ ధరల పెంపుపై వినూత్న నిరసన
X

దిశ, ఉత్తరాంధ్ర: కేంద్రప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచడాన్ని సీపీఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ అప్పారావు విగ్రహం ఎదుట గ్యాస్ సిలిండర్లకు ఉరి వేసుకొని వినూత్నమైన నిరసన చేపట్టింది.


అలాగే జగదాంబ సెంటర్ ప్రాంతంలో వద్ద సీఐటీయు నాయకులు వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై కట్టెల పోయ్యిలతో వంట చేశారు. గ్యాస్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story