- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఏం సాధించారని వైసీపీ వేడుకలు..?
దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందని సంబరాలు చేస్తున్నారని విశాఖ 22 వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ద్వారకా నగర్ విశాఖ పౌర గ్రంథాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులకు జాబ్ కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేయాలన్నారు. భూముల విలువలను ఆరు నెలలకోసారి పెంచుతున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను రద్దు చేయాలని కోరారు. విశాఖలో వందలాది ఎకరాలను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వందల కోట్ల మేరకు వెనకేసుకున్నారని తెలిపారు. మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా నాలుగేళ్లుగా రుణాలు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని పనులు ఎందుకు వేగవంతం చేయడం లేదని మూర్తి యాదవ్ ప్రశ్నించారు.