‘నాలెడ్జ్ హబ్‌గా విశాఖ’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘నాలెడ్జ్ హబ్‌గా విశాఖ’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో నేడు(బుధవారం) కేబినెట్ సమావేశం(Cabinet Meeting) జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త టెక్నాలజీ(New technology)తో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. విదేశీ పెట్టుబడుల(Foreign investment) ఆకర్షణే లక్ష్యంగా పని చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి(knowledge economy)చిరునామాగా విశాఖను మారుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. భావనపాడులో పది వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్ హబ్(Industrial hub) ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. విశాఖ నుంచి భావనపాడు(శ్రీకాకుళం) వరకు రోడ్డు(Road) నిర్మిస్తామన్నారు. 2025లోగా భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం. వంశధార నుంచి నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం కావాలి సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమల(industries)కు ప్రాధాన్యం ఇస్తాం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

Next Story