- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paderu: ఏకమైన గిరిజనులు.. ఎరుపెక్కిన మన్యం
దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా మొత్తం ఎరుపెక్కింది. అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఎస్టీల జాబితాలోకి బోయ, వాల్మీకిలను చేర్చడాన్ని నిరసిస్తూ చేపట్టిన మన్యం బంద్‌లో గిరిజనులంతా ఏకమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు, అరకు పార్లమెంట్ నజసేన కన్వీనర్ వంపురు గంగులయ్యలతోపాటు గిరిజన సంఘం నేతలు రోడ్డెక్కారు. పాడేరు ఐటీడీఏ పీవో వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైటాయించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల బ్రతుకులు అంధకారం అయ్యే ప్రమాదంలో పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వెళితే గిరిజనులంతా ఏకమై మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యభారత దేశంలో గిరిజనుల అభివృద్ధికి బీటలు పడలేదని, తమ మనుగడ ప్రశ్నార్ధకం చేశారని దుయ్యబట్టారు.