Ap News: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి

by srinivas |
Ap News: గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి
X

దిశ, విశాఖ ప్రతినిధి: రాష్ట్రంలో 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధిత పుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా ప్రభుత్వం ముద్రించి అందుబాటులోకి తీసుకురావాల్సింది. కాని ఇప్పటికీ ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో ఆంధ్రా నిరుద్యోగ జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. పుస్తకాలు అందుబాటులో లేకుండా పరీక్షలు రాయడం సాధ్యం కాదని, పరీక్షలు వాయిదా వేయాలని జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ‌ స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించడంతో వెంటనే పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలని హేమంత్ కుమార్ కోరారు.

Advertisement

Next Story