- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో భర్త దారుణం.. భార్య పోరాటం
దిశ, వెబ్ డెస్క్: భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త కర్కశంగా వ్యవహరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు అన్నీ తానై ఆలనా పాలన చూసుకోవాల్సింది పోయి వదిలించుకోవాలని చూస్తున్నారు. కష్టంలో అండగా ఉండకుంటూ పుట్టింట్లోనే వదిలిశాడు. అంతేకాదు విడాకులు ఇవ్వాలని నోటీసులు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య పోరాటానికి దిగారు. భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.
విశాఖ చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే వీరి కాపురంలో అనారోగ్యం చిచ్చు పెట్టింది. భార్యకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. కాపురానికి పనికి రావంటూ విడాకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నోటీసులు పంపారు. దీంతో భార్య న్యాయ పోరాటానికి దిగారు. భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అయితే భార్య విషయం తెలుసుకున్న భర్త అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మహిళా మండలి సభ్యులతో కలిసి భర్తపై దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.