- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి ఒకటిన ప్రధాన మంత్రి విశాఖ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఎ మల్లిఖార్జున పరిశీలించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసే నిమిత్తం మార్చి 1న దేశ ప్రధాని విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఏయూ వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ డా. ఎ. రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ , హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు.
దేశ ప్రధాన మంత్రి వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఏయే విభాగాలు ఏయే పనులు చేపట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ గోయల్, అభిషేక్ త్రివేది, సురేంద్ర గుప్త, సీజీఎం (హెచ్.ఆర్.) కిరణ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.