సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే విజయం

by Jakkula Mamatha |
సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే విజయం
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:రానున్న ఎన్నికల్లో బీజేపీ,తెలుగుదేశం, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశాఖ ఉత్తర మాజీ శానసభ్యుడు పి. విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఆంజనేయ స్వామి గుడి వద్ద కప్పరాడా జంక్షన్లో 47 వ వార్డు కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ఒకసారి అవకాశం అంటూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విశాఖను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుందని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ చెప్పినట్లు ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నారు. అవినీతి వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని అన్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చెప్పడమే తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story