- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటర్ల జాబితాలో అక్రమాలు.. విశాఖ కలెక్టర్‌పై ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ కలెక్టర్ మల్లిఖార్జునపై సీఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా అక్రమాలలో కలెక్టర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. సజావుగా ఎన్నికలు జరగాలంటే ఆయా విధులనుంచి మల్లిఖార్జునను తొలగించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే ఓట్ల అవకతవకలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వెలకపూడి రామకృష్ణ హెచ్చరించారు.
కాగా రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ల అక్రమాలు వెలుగు చూశాయి. కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఓటర్ల జాబితాలో అవకవకలు బయటపడ్డాయి. కొన్ని డోర్ల నెంబర్‌లో అధిక సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే చనిపోయిన వారికి కూడా ఓటు ఉంది. అంతేకాదు డిగ్రీ చదవని వాళ్లకు సైతం పట్టభద్రుల కోటాలో ఓట్లు నమోదు అయినట్లు గుర్తించారు. దీంతో టీడీపీ నాయకులు కోర్టులను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. అయితే విచారణలో అక్రమాలు జరిగినట్లు రుజువుకావడంతో పలువురు అధికారులపై వేటు పడింది. తాజాగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జునపైనా టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.