విశాఖలో చంద్రబాబు కు ఘనస్వాగతం

by srinivas |   ( Updated:2023-05-17 12:57:15.0  )
విశాఖలో చంద్రబాబు కు ఘనస్వాగతం
X

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో గోపాలపట్నం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు స్వాగతం పలికారు. పెందుర్తి రోడ్డు షోతో పాటు బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం చీమాలపల్లి కల్యాణ మండపంలో బస చేయనున్నారు. చంద్రబాబు గురువారం ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు.

.Also Read..

CPI: సీఎం జగన్ కుంభకోణం రూ.100 కోట్లు

Advertisement

Next Story