ఒక శాసనసభ్యుడు రాజీనామా..మరో సభ్యుడి పై అనర్హత వేటు వీరిద్దరు ఆ పార్టీ వారే?

by Jakkula Mamatha |
ఒక శాసనసభ్యుడు రాజీనామా..మరో సభ్యుడి పై అనర్హత వేటు వీరిద్దరు ఆ పార్టీ వారే?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కొత్తగా ఏర్పడిన విశాఖ జిల్లాలో ఒక శాసనసభ్యుడు రాజీనామా ఆమోదం పొందింది.మరో శాసనసభ్యుడిపై అనర్హత వేటు పడింది. ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వారే కావడం విశేషం. ఒకరు గంటా శ్రీనివాసరావు కాగా, మరొకరు వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొట్టమొదటి సారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు నిరసనగా పార్టీ ఆమోదం లేకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందిన విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మూడేళ్ల తర్వాత పక్షం రోజుల క్రితం స్పీకర్ దాన్ని ఆమోదించారు. ఇది ఇప్పుడు ఆమోదించడం అన్యాయం అని గంటా అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా ఉండడంతో ఆమోదించారు.

మరో ఎమ్మెల్యే పై వాసుపల్లి గణేష్ కుమార్ తెలుగు దేశం పార్టీ లో గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరినందుకు అనర్హత వేటు పడింది. విశాఖ లో ఒక శాసనసభ్యుడు పై వేటు వేయడం ఇదే తొలిసారి. ఇంకా ఎమ్మెల్యే పదవి కాలం 66 రోజులు ఉండగానే పదవి కోల్పోయారు.1952 నుంచి 2024 వరకు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంతో మంది శాసనసభ సభ్యులుగా పని చేసిన వాళ్ళు ఏ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచారో చివరి వరకు కూడా అదే పార్టీలో కొనసాగారు. 2020 లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో తన అనుచరులకు పదవులు,ట్రస్ట్ బోర్డు పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గం ఇన్చార్జి గా వున్నారు.

Advertisement

Next Story

Most Viewed