- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు యత్నం.. 10 మందిపై కేసు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ తంతంతాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయి. దీంతో ఎన్నికల అధికారులు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్లు నమోదు చేసినట్లు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతి పారుల ఓట్లు తొలగింపు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తమ పార్టీకి చెందిన వారి ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖలో 10 మందిపై కేసు నమోదు చేశారు.
కాగా విశాఖలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నం చేశారు. మొత్తం 163 మంది ఒకటికి మించి ఫారం-7 దాఖలు చేశారు. అలాగే 5 వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్ లైన్‌లో దరఖాస్తు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులకు కావాలనే టీడీపీ శ్రేణుల ఓట్లు తొలగించినట్లు గుర్తించారు. అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలు నిబంధనలు ఉల్లంఘించి ఫారం-7 సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి నిర్ధారించారు. నిందితులపై కేసులు నమోదు చేయించాలని విశాఖ కలెక్టర్‌కు సూచించారు. ఈ మేరకు 10 మందిపై నాలుగు పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా వైసీపీ పశ్చిమ ఇంచార్జి అడారి అనందర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందికావడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.