- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏయూలో ప్రొఫెసర్‌కి అవమానం
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాయలం ఇంచార్జి వీసీగా పని చేసిన తొలి దళిత ప్రొఫెసర్ ఆచార్య కె. సమత రాజకీయాలకు బలైపోయారు. రెక్టార్‌గా ఉంటూ ఇంచార్చిగా నియమితులైన ఆమె రెండు నెలలకే ఆ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఇది జరిగిన నెల రోజులకే ఆమెను రెక్టార్ పదవి నుంచి తప్పించారు. ఆమె పదవీ కాలం అయిపోయిందంటూ హడావుడిగా తొలగించారు. నిజానికి కొత్త రెక్టార్ నియమితులయ్యే వరకూ ఆమెనే కొనసాగించాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపధ్యంలో సాధారణంగా ఎక్సెటెన్షన్ ఇస్తారు. అటువంటివి ఏమీ లేకుండా తొలగించడం పట్ల నిరసన వ్యక్తమౌతోంది. వైఎస్సార్ పార్టీ పెద్దలకు బాగా దగ్గరవాడిగా చెబుతున్న ప్రస్తుత వీసీ ప్రసాదరెడ్డి కక్ష కట్టి సమతను తప్పించారనే ప్రచారం జరుగుతుంది. గత ఏడాది నవంబర్‌లో వీసీగా ప్రసాద రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆచార్య సమతను ఇంచార్జి వీసీగా నియమించారు. అయితే అప్పటికే పూర్తిగా ప్రసాద రెడ్డి గుప్పెట్లో వున్న విశ్వవిద్యాలయంలో ఆమెకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. రెక్టార్ చాంబర్‌లోనే వీసీగా ఛార్జీ తీసుకోవడం వివాదాస్పదం కావడం, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తరువాత రోజు వీసీ ఛాంబర్‌లో ఆమెను కూర్చోపెట్టారు. ఆమె వీసీగా ఉండగా దక్షిణ విశ్వవిద్యాలయాల క్రీడా పోటీలు ఏ యూలో జరగ్గా ఆమెను ఆ కార్యక్రమానికి ఆహ్వనించకుండా, సమాచారం ఇవ్వకుండా అవమానించారు. అప్పట్లో దీనిని తీవ్రంగా తప్పు పట్టిన దళిత సంఘాలు సమతను రెగ్యులర్ వీసీగా నియమించాలని డిమాండు చేశాయి.
అయితే, అందుకు విరుద్ధంగా గత జనవరి 17న ప్రసాదరెడ్డి తిరిగి వీసీగా నియమితులయ్యారు. తాజగా ఆమెను తొలగించారు. ప్రసాదరెడ్డిని రెండో పర్యాయం వీసీగా నియమించిన ప్రభుత్వం సమతను రెక్టార్‌గా ఎందుకు కొనసాగించలేదని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పదే పదే’ నా ఎస్‌సీ, నాఎస్‌టీలు ’అంటుంటే వారికే అవమానాలు ఎదురౌతున్నాయని విమర్శిస్తున్నారు.