- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chittoor: టీడీపీలోకి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే .. రెండు, మూడు రోజుల్లో ప్రకటన
దిశ, శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు తిరిగి టీడీపీ గూటికి చేరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన ఎస్సీవి నాయుడు తిరిగి టీడీపీలోకి చేరుతున్నారు. టీడీపీ తనను నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ తిరిగి టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. గడిచిన నాలుగేళ్లుగా అధికార వైసీపీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల ఎస్సీవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీలో చేరుతున్నానని తెలిపారు.
ఇటీవలే చంద్రబాబు నాయుడు కలిసిన ఎస్సీవీ నాయుడు..బాబు అంగీకారం లభించటంతో తిరిగి తన సొంతగూటికి చేరనున్నారు. ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే టీడీపీలో చేరనున్నారు. దీని కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక టీడీపీ కండువా కప్పుకోవటానికి రెడీగా ఉన్నారు.ఎన్నికల సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలు మారటం సర్వసాధారణమే.. అలా పార్టీలు మారే నేతలు సాధారణంగా టికెట్ ఆశించో లేదా మరే కారణాలతోనే మారుతుంటారు. కానీ తీరా మారాక ఆశించినవి లభించపోవటంతో అసంతృప్తికి గురి అయిమిన్నకుండిపోతారు. ఆ తరువాత మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరిగి పాత పార్టీలోకో లేదా తమకు సీటు తక్కించే పార్టీలోకో చేరుతుంటారు. ఈక్రమంలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా నేతలు ఆయా పార్టీలతో సంప్రదింపులు చేస్తుండటం సర్వసాధారణమే. ఇటువంటి పార్టీ ఫిరాయింపులు ఇక షురు కానున్నాయా? లేదో వేచి చూడాలి.