- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచాన్ని మార్చే బ్రహ్మస్త్రం విద్య ఒక్కటే: వి.షణ్ముఖరావు
దిశ, ఉత్తరాంధ్ర: ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటేనని శాంతినికేతన్ పాఠశాల డైరెక్టర్ వి.షణ్ముఖరావు చెప్పారు. విశాఖ ఎంవీపీ కాలనీ 7వ సెక్టార్ పాఠశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. మొక్క బాగా పెరగాలంటే ఖరీదైన కుండీ కాదని, నాణ్యమైన మట్టి కావాలన్నారు. విద్యార్థి వృద్ధి చెందాలంటే ఖరీదైన గది కాదని, నాణ్యమైన చదువు కావాలని వి.షణ్ముఖరావు తెలిపారు.
బట్టీపట్టి విద్య నేర్చుకునే విధానాన్ని తరిమికొడదామని శాంతినికేతన్ పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ కె. సాయిచంద్రిక అన్నారు. శాంతినికేతన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ప్రతిసంవత్సరం అనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతినికేతన్ స్కూల్లో ప్రతి సబ్జెక్టుని సరికొత్త యాక్టివిటీ పద్ధతులలో బోధించడం జరుగుతుందన్నారు. ప్రతీ విద్యార్థి ఎల్ కేజీ నుంచి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేలా నర్సరీ, ఎల్ కేజీ, యుకేజీ, పిల్లలకు తల్లి వద్ద పిల్లలు నేర్చుకునే తరహాలో బోధన ఉంటుందన్నారు. ప్రతి తరగతి గదిలో సీసీటీవీ పర్యవేక్షణ, కరాటే, చదరంగం, క్రీడలను ప్రత్యేకంగా తర్ఫీదునిస్తున్నామని తెలిపారు. ఐఐటి, నీట్, ఫౌండేషన్ క్లాస్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నాణ్యతతో కూడిన బోధన విధానం, అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. కార్పొరేట్ స్కూల్‌కి ధీటుగా విద్యను అందించుట, విద్యార్థుల క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.