KA PAUL: స్టీల్ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-09-27 17:43:44.0  )
KA PAUL: స్టీల్ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు
X

దిశ, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పడం కొత్త డ్రామా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ పేర్కొన్నారు. ఆయన విశాఖలో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నందున బీజేపీ ఈ డ్రామాకి తెర పైకి లేపిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇప్పుడిప్పుడే ప్రైవేటీకరణ జరగదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 25న పరుషాత్తమ రూపాలా తన షష్టి పూర్తి వేడుకల్లో పాల్గొన్న కుండా

బీజేపీ ఎం‌పీ జీవీ‌ఎల్ విఫలయత్నం చేశారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చర్చించిన మీదటే విశాఖ వచ్చారన్నారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, పాల్ విశాఖ ఎంపి అయితేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందన్నారని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ సింగ్ తనను కలవకుండా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విఫల యత్నం చేశారని గుర్తు చేశారు. అదానీ ద్వారా రూ. వెయ్యి కోట్లు పార్టీ ఫండ్ కోసం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని అభివర్ణించారు. ఏపీ ప్రజలు,

స్టీల్ ప్లాంట్‌పై ఆధార పడి ఉన్న రెండు లక్షల కుటుంబాల క్షేమం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. కానీ, ఈ విషయములో కొందరు అమ్ముడు పోయారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయములో జనవరిలో తాను అదానీతో గొడవ పడ్డానని తెలిపారు. జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అమ్మరు అని జీవీఎల్ చెబుతున్నారని తెలిపారు. ఎప్పుడు అమ్ముతారని ఎద్దేవా చేశారు. తాను విశాఖ ఎంపిగా గెలిస్తే అదానీ, మోడీ విశాఖలో అడుగు పెట్టలేరని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 40 వేల కోట్లు డిపాజిట్ చేస్తానంటూ కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పార్టీ నేతలు బీజేపీ బానిసలు అని అభివర్ణించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లోకేష్ అరెస్ట్ సబబు కాదన్నారు. మంత్రులు, పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీ 20 లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.

తాము అధికారంలోకి వస్తే వైసీపీ అక్రమాలు బయట పడవా అని కేఏపాల్ ప్రశ్నించారు. ఏ పార్టీ నేతలు అవినీతికి పాల్పడినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. రెండు కుటుంబాల పాలన అంతం కావాలన్నారు. లోకేష్ అరెస్ట్ అయితే సీఎం అవ్వాల అని అచ్చెన్నాయుడు కాచుకు కూర్చున్నారని ఆరోపించారు. ఏర్రం నాయుడు దేశ భక్తుడు అని కొనియాడారు. అచ్చెన్నాయుడు కూడా అవినీతి పరుడే కానీ, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో లోకేష్ కూడా భాగస్వామి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు అని పేర్కొన్నారు. బీజేపీకి లొంగిపోతే ఎటువంటి విచారణ ఉందని కేఏపాల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed