- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో మెడికో ఆత్మహత్య.. కారణాలివే..!
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో మెడికో కృష్ణ రమేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే కృష్ణ ఆత్మహత్యకు కారణమని గుర్తించారు. కేరళకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని కృష్ణ రమేశ్ ఈ నెల 23న విశాఖకు వచ్చారు. దాబా గార్డెన్‌లోని లాడ్జి గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగొట్టి గది లోపలికి వెళ్లి చూశారు. ఫ్యానుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకి దించి పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు.
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ మలయాళీలో సూసైడ్ నోట్ రాసి ఉంది. అయితే ఆత్మహత్యకు ముందే విశాఖ ఇండోర్ స్టేడియంలో ప్రియుడిని కృష్ణ రమేశ్ కలిశారు. వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రియుడితో వచ్చిన మనస్పర్థనల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న కృష్ణ రమేశ్.. కేరళ- విశాఖ-సింగపూర్ కనెక్టింగ్ ఫైట్‌లో విశాఖకు వెళ్లారు. చైనా వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చిన ఆమె ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లోనే పురోగతి సాధించారు.