- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: ఒకే బార్ వద్ద మూడు మర్డర్లు!
దిశ, వెబ్ డెస్క్: ఒక బార్ వద్దే మూడు మర్డర్లు జరిగాయంటే విశాఖలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారాహి యాత్ర మూడో విడత పూర్తి చేసుకుని ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. స్థానిక యువతను గంజాయి, డ్రగ్స్ మత్తులో ఉంచి కొంతమంది నాయకులు పబ్బం గడుపు క్కుంటున్నారన్నారని ఆయన మండిపడ్డారు. ట్రాఫిక్ చలనాలపేరుతో ప్రజలను జగన్ సర్కార్ దోపిడీ చేయిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ దోపిడికి సామాన్యుడు ఎలా బతుకుతారని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సంబంధిత శాఖలకు కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఫిర్యాదు చేస్తామని పవన్ హెచ్చరించారు.
జగన్ రాజకీయ నాయకుడు కాదని, ఒక వ్యాపారి అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నేరాలకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం చేస్తున్నా రని లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని ఆరోపించారు. విశాఖలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి కడప సిమెంట్ కర్మాగారానికి తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తున్నాయన్నారు. బ్రిటీష్ హయాం కంటే తీవ్రంగా విభజింజి పాలిస్తున్నారని జగన్ సర్కారుపై పవన్ మండిపడ్డారు.