- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువు పెంపు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువును అధికారులు మరో 5 రోజులు పెంచారు. నేటితో ముగియనున్న నేపథ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకూ 22 కంపెనీలు ఈవోఐలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరిన్ని సంస్థలు పాల్గొంటాయనే సమాచారంతో ఈవోఐ గడువును పెంచినట్లు అధికారుల తెలిపారు.
కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఏపీ రాజకీయపార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలిపింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ కూడా వేసింది. అధికారుల బృందాన్ని పంపి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలించేలా ఏర్పాట్లు కూడా చేసింది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది.