- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్మగడ్డ రమేష్ కు ఆ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి:మంత్రి బొత్స
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:వాలంటీర్ల పై కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి టీడీపీ తో సంబంధాలు వున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెట్టించారని సోమవారం విశాఖ లో విలేకరుల సమావేశంలో అన్నారు.వాలంటీర్ల తో పెన్షన్ పెంచడానికి వీలు లేదని,దాని వల్ల వైసీపీ కి మేలు జరుగుతుంది అని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాలంటీర్లు పంచుతున్నారుగా అని ప్రశ్నించారు.పెన్షన్ ల పంపిణీ మూడు లక్షల మంది చేసే పని అన్నారు. ఇంతకు ముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవడం వల్ల మోసానికి పాల్పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అని తప్పు రాతలు రాయడం తప్పు అని,60 లక్షల మంది పేద వారికి పెన్షన్ ఇస్తుంటే అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. మూడు నెలలే ఈ ఇబ్బందులని చెప్పారు.రమేష్ లాంటి వ్యక్తులు చేస్తున్నది తప్పు దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు. వృద్ధులు, వికలాంగుల కు ఏమీ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని నంగ నాచి లాగా లేఖలు రాయడం సరికాదని అన్నారు.సచివాలయం ఉద్యోగులు ని నియమించింది జగన్ మోహన్ రెడ్డి అని, మరి వాళ్ళు మా మనుషులే అవుతారు కదా అని ప్రశ్నించారు.