- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు.. అచ్యుతాపురం ఘటనపై ఎమ్మెల్సీ బొత్స ఫైర్
దిశ, వెబ్ డెస్క్: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబాలను విశాఖ కేజీహెచ్‌లో పరామర్శించిన బొత్స.. ప్రమాదంపై పాలక పార్టీ తీరు బాధాకరమని విమర్శించారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని, నష్టపరిహారంపై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కంపెనీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటికే తమ పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేశారని చెప్పారు. మృతుల కుటుంబాలను ఇప్పటివరకూ స్థానిక టీడీపీ నాయకులు పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదని బొత్స విమర్శించారు