పేదల కోసమే పార్టీ మారా.. అదంతా అవాస్తవం: ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

by srinivas |   ( Updated:2024-01-29 14:47:18.0  )
పేదల కోసమే పార్టీ మారా.. అదంతా అవాస్తవం: ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం విచారణకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గణేశ్‌కు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరయి పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వాసుపల్లి గణేశ్ ఇవాళ స్పీకర్ ఎదుట హాజరయ్యారు. పేదవాళ్లకు టీడీపీ అన్యాయం చేస్తోందని తాను పార్టీకి దూరం జరిగానని వాసుపల్లి గణేశ్ స్పీకర్ కు వివరించారు. తాను పార్టీని మోసం చేశానని టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. స్పీకర్‌గా తమరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. స్పీకర్ ప్రొసీజర్ ప్రకారమే తన వివరణ తీసుకున్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయ సలహా తీసుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ స్పష్టం చేశారు.

Read More..

Ayyavaram: వామ్మో అటు వెళ్లొద్దు..!

Advertisement

Next Story

Most Viewed