భారత్ విశ్వా మిత్ర పాత్ర పోషిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్

by srinivas |   ( Updated:2024-02-21 17:19:44.0  )
భారత్ విశ్వా మిత్ర పాత్ర పోషిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచ దేశాలతో విశ్వా మిత్ర పాత్రను పోషించడాన్ని భారత్ కొనసాగిస్తుందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం విశాఖలో ఆయన భారత నావికాదళం నిర్వహిస్తున్న మిలాన్ -2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ అర్ధవంతమైన భాగస్వామ్యాలతో ప్రపంచ దేశాలతో కలసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రపంద దేశాలన్ని ప్రజాస్వామిక, నిబంధనల ఆధారిత విధానాలతో అంతర్జాతీయ శాంతి, సౌబ్రాతత్వాల కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. భారత ఉపఖండంతో పాటు ఇండో పసిఫిక్ రీజియన్‌లో శాంతిని కాపాడే విషయంలో భారత్ ముందుంటుందని స్పష్టం చేశారు. గురువారం జరిగే మిలాన్ కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed