- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి అమర్‌నాథ్‌కు గుడ్‌న్యూస్... ఆ సీటు కేటాయిస్తూ సీఎం నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మార్పులు, చేర్పుల నేపథ్యంలో కంట తడి పెట్టిన మంత్రి గుడివాడ అమర్నాథ్కు సీఎం జగన్‌కు గుడ్ న్యూస్ తెలిపారు. పెందుర్తి సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి ఇంచార్జిగా మరో వ్యక్తికి అవకాశం ఇచ్చారు. దీంతో తనకు సీటు లేదేమోనని మంత్రి అమర్‌నాథ్ ఆందోళన చెందారు. అనకాపల్లి మీటింగ్‌లో భావోద్వేగానికి గురయ్యారు. తాను అనకాపల్లికి చాలా రుణ పడి ఉంటానని, సీఎం జగన్ ఆదేశిస్తే మళ్లీ పోటీ చేస్తానని, లేదంటే పార్టీ బలోపేతం కృషి చేస్తానని అమర్‌నాథ్ పేర్కొన్నారు. దీంతో ఆయన వర్గంలో నిరాశ నెలకొంది.
అయితే సీఎం జగన్ రెడీ చేసిన మూడు లిస్ట్‌లో మంత్రి అమర్‌నాథ్‌కు పెందుర్తిని కేటాయించారు. యలమంచిలి, చోడవరాన్ని పరిశీలించిన జగన్ చివరకు పెందుర్తిని ఫైనల్ చేశారు. మరోవైపు పెందుర్తి నుంచి గతంలో అమర్‌నాథ్ తండ్రి, తాత పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతేగాక ఆ నియోజకవర్గంలో కాపు, వెలమ సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తండ్రి, తాత సెంటిమెంట్‌తో పాటు బలమైన రెండు సామాజిక వర్గాల ఓట్లతో మంత్రి అమర్‌నాథ్ గెలుపు ఈజీగా ఉంటుందని జగన్ అంచనా వేశారు. అటు పెందుర్తిలో చేయించిన సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌పై నెగిటివ్ రిపోర్టు అందింది. దీంతో ఈసారి టికెట్ అదీప్‌రాజుకు నిరాకరించారు. ఇక మంత్రి అమర్‌నాథ్‌కు సీటు ఖరారు చేయడంతో మంత్రి అమర్‌నాథ్ అనుచరవర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. జగన్ అంచనాల ప్రకారం పెందుర్తి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.