- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టుల హెచ్చరిక
దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఏపీ ప్రభుత్వాన్ని మావోయిస్టులు హెచ్చరిస్తూ రెండు పేజీల లేఖను విడుదల చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరిజిల్లా డివిజన్ మావోయిస్టు కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదల అయింది. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు కారణం ప్రభుత్వ నిర్లక్షమేనని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ రంపచోడవరం ఐటీడీఏ పీఓ సూరజ్ గనోరేను, పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క నెలలోనే వివిధ ఆశ్రమ పాఠశాలలో పది, పన్నెండేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు మరణించారని, ఆరు నెలల్లో ఈ మరణాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయని తెలిపారు. గిరిజన విద్యాశాఖ డీడీ కొండలరావు హాస్టళ్ల నుంచి పిల్లలు చెప్పకుండా వెళ్లిపోతున్నారనీ, తల్లితండ్రులు నిరక్ష్యరాసులు కావడంతో, నాటువైద్యం అందించడం వల్లే పిల్లలు మరణిస్తున్నారనీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన, వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలు, రిలే నిరాహారదీక్షలు వంటివేవీ వీరికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటే ఆదివాసీ పిల్లల ప్రాణాల పట్ల వీరికెంత నిర్లక్ష్యం ఉందో అర్థం అవుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘భేటీ బచావో, భేటీ పడావో’ అంటూ విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు, సంస్కరణలు ప్రవేశ పెడుతున్నామని ఊదరగొట్టడమే.. కానీ అచరణలోకి తీసుకురాలేకపోతున్నారని మండిపడ్డారు. హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం లేదని, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మెనూను అధికారులు పాటించడం లేదన్నారు. పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నాన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా రక్తహీనతతో చనిపోతున్నారని తెలిపారు. ఈ మరణాలకు కారణం ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని.. దీనికి ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని మావోలు ఈ లేఖలో హెచ్చరించారు