- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VV Laxminarayana: మళ్లీ అక్కడి నుంచే పోటీ.. స్పష్టత ఇచ్చిన లక్ష్మీనారాయణ
దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున ఆయన విశాఖ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో ఆయన పోటీపై స్పష్టత ఇచ్చారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ తన పొలిటికల్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తన ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచి తాను పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, విశాఖ రైల్వే జోన్‌పై తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం పునరాలోచించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.