- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varahi Yatra: ఆయన వల్లే ఆంధ్రావాళ్లను తన్ని తరిమేశారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖ జగదాంబ సెంటర్‌లో వారాహి యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు. తత మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేయడం తప్ప.. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సీఎం జగన్‌కు పట్టదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం జగనేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ఎక్కువగా దౌర్జన్యాలు చేయడం వల్లే ఆంధ్ర వాళ్లను అక్కడి ప్రజలు తన్ని తరిమేశారని పవన్ గుర్తు చేశారు. అందులో జగన్ ముఖ్యమైన వ్యక్తి అని పవన్ పేర్కొన్నారు. వైసీపీని తన్ని తరిమే వరకూ తాను నిద్దపోనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కొండలు తవ్వేస్తారని గత ఎన్నికల్లో తాను గొంగు చించుకుని మరీ చెప్పానని పవన్ తెలిపారు. అడ్డంగా దోచుకున్న వారిని గద్దెనెక్కించారని, కానీ ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని హెచ్చరించారు. తాను చూడటానికి పలుచగా ఉన్నా ఒళ్లంతా మందమని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
Read More..
మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అస్త్రం: చంద్రబాబు వ్యూహం ఫలించేనా?
మెగాస్టార్ చిరంజీవికి దిల్ రాజు సపోర్ట్.. వైసీపీ నేతలపై పరోక్ష విమర్శలు