- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగన్ మాట తప్పారు..మడమ తిప్పారు’ టీడీపీ నేత హాట్ కామెంట్స్..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మద్యనిషేధం లో మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన జగన్ ప్రతి సంవత్సరం మద్యం షాపులు పెంచారే తప్ప నిషేధించలేకపోయాడని అన్నారు.జగన్ మద్యనిషేధం చేస్తానని చెప్పి మూడు సార్లు మద్యం రేట్లు పెంచారని నాసిరకం మద్యం త్రాగి సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని, సీఎం జగన్ ధనదాహం కోసం సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ’ఇసుకు సామాన్యుడి కి అందుబాటు లో ఉండాలి . నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయాలి.ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే చెట్లు నరకకుండా ఉండాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి బహిరంగంగా 99 టిక్కెట్లు ప్రకటించారు. వైసీపీ పార్టీ సమన్వయకర్తను మాత్రమే ప్రకటించారని, జగన్ డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.రానున్న ఎన్నికల్లో జగన్ కుర్చీని మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ పాల్గొన్నారు.